vinayak: 'మెగా' హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తోన్న తేజు!

  • తేజు హీరోగా వినాయక్ మూవీ
  • 'కొండవీటి దొంగ' సాంగ్ పై దృష్టి 
  • ప్రత్యేక ఆకర్షణ కోసం ప్రయత్నం

కెరియర్ ఆరంభంలోనే మాస్ హీరోగా సాయిధరమ్ తేజ్ మంచి మార్కులు కొట్టేశాడు. కొన్నిమార్లు హిట్లు .. మరికొన్ని మార్లు అపజయాలు పలకరించినా, తనదైన స్పీడుతో ఆయన దూసుకుపోతూనే వున్నాడు. ఈ క్రమంలోనే ఆయన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో మాదిరిగానే ఈ సినిమాలోను తేజు ఒక మెగా సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.

 'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమకు ఛమకు ఛామ్' సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటలో చిరూ వేసిన స్టెప్స్ కి అభిమానులు విజిల్స్ వర్షం కురిపించారు. ఇళయరాజా స్వరపరిచిన అప్పటి ఈ పాటను, వినాయక్ మూవీలో తేజు రీమిక్స్ చేసి సందడి చేయనున్నాడట. ఇదే నిజమైతే ఈ సాంగ్ రీమిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పవచ్చు.       

More Telugu News