భారీ రేటుకు మెగా హీరో మూవీ శాటిలైట్ హక్కులు!

- వినాయక్ దర్శకత్వంలో తేజు యాక్షన్ ఎంటర్ టైనర్
- శాటిలైట్ హక్కులకు గట్టి పోటీ
- సొంతం చేసుకున్న జెమిని చానెల్
లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీనే ఏర్పడిందట. తాజాగా జెమినీ ఛానల్ వారు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వాళ్లు భారీ మొత్తమే చెల్లించారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రాహుల్ దేవ్ విలన్ గా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.