facebook: ఖాతా తెరవడానికి ఆధార్ అవ‌స‌రం లేదు!: స్ప‌ష్టం చేసిన ఫేస్ బుక్

  • ఆధార్‌లోని పేరు వాడుకుంటే మంచిద‌ని సూచ‌న‌
  • కొత్త వినియోగ‌దారుల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మేన‌ని ప్ర‌క‌ట‌న‌
  • ఆధార్ త‌ప్ప‌నిస‌రంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను ఖండించిన ఫేస్‌బుక్‌

సోష‌ల్‌మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌లో ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్ వివరాలు త‌ప్ప‌నిస‌రిగా ఎంట‌ర్ చేయాలంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ఆ సంస్థ ఖండించింది. ఆధార్ వివ‌రాల‌ను తాము అడ‌గ‌బోమ‌ని, అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌ల‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. కాక‌పోతే ఇందుకు సంబంధించి ఓ కొత్త విధానాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని, అది కేవ‌లం అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోస‌మేన‌ని పేర్కొంది.

కొత్తగా అకౌంట్ తెర‌వాల‌నుకునే వారు ఆధార్‌లో ఉన్న పేరుతో ఖాతా సృష్టించుకోవ‌డం వ‌ల్ల స్నేహితుల‌తో, కుటుంబ‌స‌భ్యుల‌తో త్వ‌ర‌గా క‌నెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని గురించి అవ‌గాహ‌న పెంచేందుకే ఆధార్‌లో ఉన్న పేరును ఉప‌యోగించాల‌ని సూచ‌న వ‌స్తుంది. దాన్ని పాటించాల‌నుకున్న వారు పాటించుకోవ‌చ్చు.. లేదంటే మామూలుగా ఇష్టం వ‌చ్చిన పేరుతో ఖాతాను సృష్టించుకోవ‌చ్చ‌ని తెలిపింది.

More Telugu News