npas: బ్యాంకుల్లో మొండి బాకీలతో అంతర్జాతీయంగా పడిపోయిన భారత ప్రతిష్ట

  • 9.85 శాతానికి మొండి బకాయిలు
  • భారత్ కంటే ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్న దేశాలు ఐదు
  • యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది 

మన దేశ బ్యాంకింగ్ రంగంలో వసూలు కాని మొండి బకాయిలు (వీటికే నిరర్థక ఆస్తులు, రుణ ఎగవేతలు, చెడ్డ రుణాలు అనే పేర్లూ ఉన్నాయి) మొత్తం రుణాల్లో 9.85 శాతానికి పెరిగిపోవడంతో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పడిపోయింది. ఈ స్థితిని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలుగా భారత్ సరసన పోర్చుగల్, ఇటలీ, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ మాత్రమే ఉన్నాయి. అంటే భారత్ కంటే అధిక మొండి బకాయిలు కలిగిన దేశాలు కేవలం ఈ ఐదే.

కేర్ రేటింగ్స్ ఏజెన్సీ పరిశోధన నివేదిక ప్రకారం చూస్తే పునరుద్ధరించిన రుణాలను కూడా కలిపితే ఎన్ పీఏలు మరో రెండు శాతం ఎక్కువే ఉంటాయి. యూరోపియన్ దేశాల్లో మొండి బకాయిల సమస్య ఎప్పటి నుంచో ఉంది. కానీ, మన దేశంలో మొండి బకాయిలను గుర్తించడం రెండేళ్ల క్రితమే మొదలైంది. అది కూడా రఘురామ్ రాజన్ చేపట్టిన సంస్కరణల చర్యల వల్లే.

More Telugu News