psotal depostes: పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మరోసారి తగ్గాయ్!

  • పలు పథకాలపై 0.20 శాతం తగ్గింపు
  • పీపీఎఫ్, ఎన్ఎస్ సీ పథకాలపై రేటు 7.6 శాతానికి
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పై మార్పు లేదు

సామాన్యులకు ఎంతో చేదోడుగా నిలిచే చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పోస్టాఫీసు పొదుపు పథకాలు... పీపీఎఫ్, రికరింగ్ డిపాజిట్, ఎన్ఎస్ సీ, కిసాన్ వికాస్ పత్రపై కేంద్ర సర్కారు వడ్డీ రేట్లను మరోసారి 0.20 శాతం తగ్గించింది. కేంద్రంలో మోదీ సర్కారు కొలువు తీరిన తర్వాత వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2016 ఏప్రిల్ నుంచి ప్రతీ క్వార్టర్ కు రేట్లను సమీక్షించి, సవరిస్తూ వస్తోంది. తాజాగా 2018 జనవరి నుంచి మార్చి వరకు అమల్లో ఉండే రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

సవరణ తర్వాత పీపీఎఫ్, ఎన్ఎస్ సీలపై 7.6 శాతం వడ్డీ రేటు, కిసాన్ వికాస్ ప్రతపై 7.3 శాతంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనపై 8.1 శాతం, ఒక ఏడాది నుంచి ఐదేళ్ల వరకు టర్మ్ డిపాజిట్లపై 6.6 నుంచి 7.4 శాతం మధ్య, రికరింగ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పై 8.3 శాతం వడ్డీ రేటు, సేవింగ్స్ డిపాజిట్ ఖాతాపై 4 శాతం వడ్డీ రేట్లలో ఏ విధమైన మార్పు చేయలేదు.

More Telugu News