pavan kalyan: 'అజ్ఞాతవాసి'లో యాక్షన్ సీన్లో వెంకీ ఎంట్రీ!

  • 'అజ్ఞాతవాసి'లో వెంకటేశ్ 
  • ఆయన పాత్ర పట్ల అందరిలో ఆసక్తి 
  • ఆయన సీన్ హైలైట్ అవుతుందంటూ ప్రచారం  

'గోపాల గోపాల' సినిమాలో పవన్ .. వెంకటేశ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'అజ్ఞాతవాసి' సినిమాలోను పవన్ తో కలిసి వెంకటేశ్ కనిపించనున్నారనే వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో వెంకటేశ్ 4 నిమిషాల సేపు మాత్రమే కనిపిస్తారని చెప్పుకుంటున్నారు. దాంతో ఆయన పాత్ర ఎలా ఎంట్రీ ఇస్తుందనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ మేనమామగా ఓ కామెడీ సీన్ లో వెంకటేశ్ కనిపించనున్నారనే టాక్ నిన్నమొన్నటి వరకూ వినిపించింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం వెంకటేశ్ కనిపించేది కామెడీ సీన్లో కాదట .. ఓ యాక్షన్ సీన్లో అంటున్నారు. పవన్ తో పాటు .. వెంకటేశ్ కనిపించే ఈ ఫైట్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ సీన్ సీరియస్ గా .. పవర్ ఫుల్ గా ఉంటుందా? లేదంటే కామెడీ టచ్ తో ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

More Telugu News