Auto: ఈ ఘోరమైన యాక్సిడెంట్ ఎలా జరిగింది...?: ఆర్టీసీ డ్రైవర్ వర్షన్ ఇది

  • విద్యార్థినుల ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • ఐదుగురు దుర్మరణం
  • బస్సును ఆటో ఓవర్ టేక్ చేయబోయిందన్న డ్రైవర్
  • యాక్సిండెంట్ తో బాధ కలుగుతోందని వెల్లడి

ఈ ఉదయం గుంటూరు జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు, టెన్త్ క్లాస్ విద్యార్థినులతో ప్రయాణిస్తున్న ఆటో ఢీకొనగా, ఐదుగురు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించిన వివరాలు, ప్రమాదానికి కారణాలను ఆర్టీసీ డ్రైవర్ వెల్లడించాడు. వేమవరం నుంచి పేరేచర్లకు బస్సు వెళుతోందని, ఆ సమయంలో మంచు చాలా ఎక్కువగా ఉండి, ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొందని చెప్పాడు.

ప్రమాద సమయంలో బస్సు మితిమీరిన వేగంతో వెళ్లడం లేదని చెప్పిన ఆయన, బస్సు ఓ టర్నింగ్ వద్దకు రాగానే, వెనక నుంచి వస్తున్న ఆటో, బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసిందని అన్నాడు. ఈ క్రమంలో ఆటోనే అదుపుతప్పి బస్సును ఢీకొందని, పొగమంచు కారణంగా వెనక వస్తున్న ఆటో తనకు కనిపించలేదని అన్నాడు. ఈ ఘటనలో నలుగురు బాలికలు చనిపోవడం తనకెంతో బాధను కలిగిస్తోందని చెప్పాడు. వెంటనే తాను బస్సును ఆపి ఆటోలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు సాయం చేశానని చెప్పాడు. రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోవడం, పొగమంచు కమ్మేయడం ప్రమాదానికి కారణాలన్నాడు.

More Telugu News