nani: నాని 'కృష్ణార్జున యుద్ధం' రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • డ్యూయల్ రోల్‌లో నాని
  • ఏప్రియల్ 12, 2018న విడుదల
  • నాని సరసన అనుపమ

న్యాచురల్ స్టార్ నాని డ్యూయల్ రోల్‌ లో నటిస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు.

నాని, గాంధీ ఇద్దరూ సక్సెస్‌ ఫుల్ ఫామ్‌ లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలిసారిగా డబుల్ యాక్షన్ చేయనున్న నాని సరసన అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది.  

More Telugu News