Virat Kohli: క్రికెట్ తో మళ్లీ కనెక్ట్ కావడం నాకు కష్టం కాదు.. నా రక్తంలోనే క్రికెట్ ఉంది!: విరాట్ కోహ్లీ

  • దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ
  • ఏదో నిరూపించుకోవాలని ఈ టూర్ కు వెళ్లడం లేదు
  • గతంలో సాధించలేనిది ఇప్పుడు సాధిస్తామనే ధీమా ఉంది

తన రక్తంలోనే క్రికెట్ ఉందని విరాట్ కోహ్లీ చెప్పాడు. దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లే ముందు హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడాడు. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా? క్రికెట్ తో మళ్లీ ఎలా కనెక్ట్ అవుతారనే మీడియా ప్రశ్నకు కోహ్లీ పైవిధంగా సమాధానమిచ్చాడు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కోసం సెలవు తీసుకున్నానని, క్రికెట్ తో మళ్లీ కనెక్ట్ కావడం తనకు కష్టమేమీ కాదని చెప్పాడు. పెళ్లి నిమిత్తం కొన్నాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ మూడు వారాలుగా దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు.

 ఏదో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లడం లేదని, కేవలం క్రికెట్ ఆడేందుకే వెళుతున్నామని చెప్పిన కోహ్లీ, గతంలో సాధించలేనిది ఇప్పుడు చేస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ఈ సిరీస్ ను అతిపెద్ద సవాల్ గా భావించి పట్టుదలతో జట్టు ముందుకు వెళుతోందని అన్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు సిరీస్ లు, ఆరు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్ లలో భారత్ తలపడనుంది. కొత్త ఏడాది జనవరి 5 నుంచి ఇరు దేశాల మధ్య తొలి టెస్టు కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జరగనుంది. 

More Telugu News