PV Sindhu: త‌న పేరుతో అధికారిక మొబైల్ యాప్ విడుద‌ల చేసిన పీవీ సింధు

  • ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల‌
  • ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ల‌లో ల‌భ్యం
  • సింధుతో లైవ్ చాట్ చేసే అవ‌కాశం

అభిమానుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉండేందుకు బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు త‌న పేరుతో ఓ అధికారిక మొబైల్‌ యాప్‌ను విడుద‌ల చేశారు. ఈ యాప్‌ను ప్రారంభించిన విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ మొబైళ్ల‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి అందుబాటులో ఉందని ఆమె వెల్ల‌డించారు.

ఈ యాప్ ద్వారా అభిమానులు సింధు పోస్ట్ చేసిన వీడియోలు, ఆమె పోస్టులను చూడ‌టంతో పాటు, ఆమెతో లైవ్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌లో సింధు తొలి వీడియోను పోస్ట్ చేశారు. తనకు అండగా ఉంటూ తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. smarturl.it/pvsindhu లింక్ ద్వారా యాప్‌ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని తన అభిమానులను ఆమె కోరారు.

More Telugu News