gold: మూడు వారాల గరిష్ఠానికి చేరిన బంగారం ధర

  • 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి, రూ.30,075గా నమోదు
  • కిలో వెండి ధర రూ.380 పెరిగి రూ.39,250గా నమోదు
  • సింగపూర్ మార్కెట్లో ఔన్సు 0.14 శాతం పెరిగిన బంగారం ధర  

ఈ రోజు మార్కెట్లో బంగారం ధర కాస్త పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి, రూ.30,075గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అధికంగా ఉండడంతో బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు కిలో వెండి ధర రూ.380 పెరిగి రూ.39,250గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, సింగపూర్ మార్కెట్లో బంగారం ధర 0.14 శాతం పెరిగి ఔన్సు 1,284.80 అమెరికన్‌ డాలర్లుగా నమోదైంది.

More Telugu News