akhil: 'హలో' రిలీజ్ కి ముందురోజు రాత్రి నిద్రపట్టలేదు: అఖిల్

  • 'హలో' టాక్ ఆనందాన్నిచ్చింది 
  • ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు 
  • ఫైట్స్ లో ముందుగా శిక్షణ తీసుకోవడం మంచిదైంది

అఖిల్ తాజా చిత్రంగా ఈ నెల 22వ తేదీన 'హలో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ గురించి తాజాగా అఖిల్ స్పందించాడు. "ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చాలా టెన్షన్ పడ్డాను. తెల్లవారితే రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు" అన్నాడు.

 "పాజిటివ్ టాక్ అంటూ యూఎస్ నుంచి కాల్ రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి షోకు వచ్చిన టాక్ నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. నా కుటుంబ సభ్యులే కాదు .. ప్రేక్షకులు కూడా నా నటన .. డాన్సులు .. ఫైట్లు చాలా బాగా వున్నాయంటూ అభినందించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చేయడం చాలా కష్టతరమైన పని. కానీ షూటింగ్ మొదలు కావడానికి ముందే, 'బాబ్ బోర్న్' అనే స్టంట్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. అందువలన ఈ సినిమాలోని ఫైట్స్ ను ఈజీగా చేయగలిగాను" అని చెప్పుకొచ్చాడు.    

More Telugu News