Chandrababu: ఏపీలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం.. రూ. 149తో అదిరిపోయే ఆఫర్లు!

  • అమరావతిలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
  • గ్రిడ్ ను ప్రారంభించిన రాష్ట్రపతి
  • రూ. 5వేల కోట్ల ప్రాజెక్టును రూ. 330 కోట్లతో పూర్తి చేశామన్న సీఎం

ఏపీలో ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, ఫోన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఫైబర్ గ్రిడ్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సేవల ద్వారా నెలకు కేవలం రూ. 149తో మూడు రకాల సేవలను ప్రజలు పొందనున్నారు. రోజంతా వైఫై, 5జీబీ 15 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, 250 టీవీ ఛానల్స్, ఫోన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని ఈ సేవలను అందించనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఈ తరహా ప్రాజెక్టు ప్రపంచంలో ఇంతవరకు లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా నినాదాన్ని తాము అందిపుచ్చుకున్నామని తెలిపారు. రూ. 5వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును రూ. 330 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. 2018 నాటికి కోటి వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి, ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

More Telugu News