selfie: సెల్ఫీలు తీసుకోవ‌డం ఓ మాన‌సిక జ‌బ్బు... ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి!

  • సెల్ఫీటిస్ అని పేరు
  • జ‌బ్బు స్థాయిని అంచ‌నా వేయ‌డానికి ఓ స్కేల్‌
  • సెల్ఫీ మ‌ర‌ణాల‌కు కార‌ణం ఇదే

సెల్ఫీలు తీసుకోవ‌డం ఓ మాన‌సిక వ్యాధి అని 2014లోనే అమెరిక‌న్ సైకియాట్రిక్ అసోసియేష‌న్ ప్ర‌క‌టించిన‌ట్లు అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. అయితే వాటిలో ఎంత మాత్రం నిజ‌ముందో తెలుసుకోవాల‌ని లండ‌న్‌కి చెందిన నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివ‌ర్సిటీ, త‌మిళ‌నాడుకి చెందిన త్యాగ‌రాజ‌న్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు సంయుక్తంగా అధ్య‌య‌నం చేప‌ట్టాయి. ఈ అధ్య‌య‌నంలో వారు సెల్ఫీలు తీసుకోవ‌డ‌మ‌నేది ఓ మాన‌సిక జ‌బ్బు అని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆ జ‌బ్బు స్థాయిని అంచ‌నా వేయ‌డానికి 'సెల్ఫీటిస్ బిహేవియ‌ర్ స్కేల్‌'ని కూడా రూపొందించారు.

ఈ స్కేల్‌లో బార్డ‌ర్‌లైన్‌, ఏక్యూట్‌, క్రానిక్ అనే మూడు విభ‌జ‌న‌లు ఉన్నాయి. రోజులో ఆరు కంటే ఎక్కువ సెల్ఫీల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వారంద‌రూ క్రానిక్ సెల్ఫీటిస్ కింద‌కి వ‌స్తారని అధ్య‌య‌నంలో పేర్కొన్నారు. భార‌త‌దేశంలోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన దాదాపు 734 మంది విద్యార్థినీవిద్యార్థుల‌ను స‌ర్వే చేసి, వారిలో దాదాపు 400 మందికి సెల్ఫీటిస్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ అధ్య‌య‌నం కోసం భార‌తీయ విద్యార్థుల‌ను ఎంచుకోవ‌డానికి ఓ అర్థం ఉంది. ఇక్క‌డే ఎక్కువ మంది ఫేస్‌బుక్ వినియోగ‌దారులు ఉండ‌టం, సెల్ఫీ మ‌ర‌ణాలు కూడా ఇక్క‌డే ఎక్కువ‌గా ఉండ‌టంతో అధ్య‌య‌నాన్ని ఇక్క‌డ చేప‌ట్టారు. 2016లో దాదాపు 127 సెల్ఫీ మ‌ర‌ణాలు సంభవిస్తే అందులో 76 మ‌ర‌ణాలు మ‌న దేశంలోనే సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News