sundeepkishan: సందీప్ కిషన్ కి హిట్ తెచ్చిపెట్టిన 'మాయావన్'

  • తమిళ ప్రేక్షకుల ముందుకు 'మాయావన్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి మార్కులు 
  • 'ప్రాజెక్టు Z' పేరుతో తెలుగులోకి  

తెలుగులో అవకాశాలు తక్కువగానే వున్నా, తాను చేస్తోన్న తమిళ సినిమాలు తెలుగులో విడుదలయ్యేలా సందీప్ కిషన్ చూసుకుంటున్నాడు. అలా తమిళంలో ఆయన చేసిన 'మా నగరం' ..'నగరం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత వచ్చిన 'కేరాఫ్ సూర్య' సినిమా కూడా అక్కడ మంచి మార్కులు సంపాదించుకుంది.

 ఈ రెండు సినిమాలు తెలుగులో ఓ మాదిరిగానే ఆడాయి. ఈ నేపథ్యంలో తమిళంలో సందీప్ కిషన్ తాజా చిత్రంగా ఇటీవలే 'మాయావన్' విడుదలైంది. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడ విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాతో ఈ ఏడాది చివరిలోను హిట్ ను సొంతం చేసుకున్నందుకు సందీప్ కిషన్ ఫుల్ ఖుషీ అవుతున్నాడట. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను, త్వరలోనే 'ప్రాజెక్టు Z' పేరుతో తెలుగులోను విడుదల చేయనున్నారు. ఇక్కడ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.  

More Telugu News