వినూత్నంగా క్రిస్‌మ‌స్ శుభాకాంక్షలు తెలిపిన నేచుర‌ల్ స్టార్ నాని!

Mon, Dec 25, 2017, 03:05 PM
  • ఎం-మెర్రీ, సీ- క్రిస్‌మ‌స్‌, ఏ-అందరికీ అంటూ ట్వీట్‌
  • ఎంసీఏ సినిమాను గుర్తు చేసిన నాని
  • వైర‌ల్ అవుతోన్న ట్వీట్‌
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అల‌రిస్తోన్న నేచుర‌ల్ స్టార్‌ నాని ఈ రోజు 'ఎంసీఏ'కి కొత్త నిర్వ‌చ‌నం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్టియ‌న్లు క్రిస్‌మ‌స్ జ‌రుపుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా 'ఎం-మెర్రీ, సీ- క్రిస్‌మ‌స్‌, ఏ-అందరికీ' అంటూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. నాని పోస్ట్ అంద‌రినీ అల‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంసీఏ సినిమాను గుర్తు చేస్తూ భ‌లే ట్వీట్ చేశాడ‌ని నెటిజన్లు అంటున్నారు. కాగా, నాని ఎంసీఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement