annadmk: క‌ఠిన నిర్ణ‌యం.. అన్నాడీఎంకే నుంచి ఆరుగురు నాయ‌కుల తొల‌గింపు

  • వెట్రివేల్‌, తంగ త‌మిళ్ సెల్వ‌న్, రంగ స్వామి పార్టీ నుంచి తొల‌గింపు
  • ముత్త‌య్య‌, క‌లైరాజ‌న్‌, షోలింగూర్ పార్థిబ‌న్‌ల‌ను కూడా
  • అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత‌ల స‌మావేశంలో నిర్ణ‌యం
  • ఆర్కేన‌గ‌ర్‌లో దిన‌క‌ర‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోప‌ణ‌లు

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతితో ఖాళీ అయిన‌ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దిన‌క‌ర‌న్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించిన ఈ ఎన్నికలో ఓడిపోవ‌డంతో అన్నాడీఎంకే ప‌లు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది.

తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ రోజు ఉదయం నుంచి చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో ప‌లువురు పార్టీ నేత‌లను తొల‌గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

వెట్రివేల్‌, తంగ త‌మిళ్ సెల్వ‌న్, రంగ స్వామి, ముత్త‌య్య‌, క‌లైరాజ‌న్‌, షోలింగూర్ పార్థిబ‌న్‌ల‌ను పార్టీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయా నేత‌లు టీటీవీ దినకరన్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ విష‌యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామ‌ని అధిష్ఠానం పేర్కొంది.        

More Telugu News