mohanbabu: మోహన్ బాబు 'గాయత్రి' ఫస్ట్ లుక్ వచ్చేసింది!

  • మోహన్ బాబు ప్రధాన పాత్రగా 'గాయత్రి'
  • ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు 
  • ఫిబ్రవరి 9వ తేదీన విడుదల

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గాయత్రి ' సినిమా ఫస్టు లుక్ ని ఈ రోజు విడుదల చేశారు . "ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే... నాదీ తప్పే" అనే పవర్ఫుల్ క్యాప్షన్ ను పోస్టర్ లో ఇచ్చారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో మోహన్ బాబు పాత్ర ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుందని అంటున్నారు. మంచు విష్ణు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో, శ్రియ .. నిఖిలా విమల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఫిబ్రవరి 9 వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే .




More Telugu News