priyanka azad: ప్రియాంక చోప్రాకు గౌర‌వ డాక్ట‌రేట్‌.. ప్ర‌క‌టించిన బ‌రేలీ అంత‌ర్జాతీయ యూనివ‌ర్సిటీ

  • ఐదేళ్ల త‌ర్వాత స్వ‌స్థ‌లానికి విచ్చేయ‌బోతున్న ప్రియాంక‌
  • అందుకు జ్ఞాప‌కంగా డాక్ట‌రేట్‌
  • ఆనందం వ్య‌క్తం చేసిన ప్రియాంక త‌ల్లి మ‌ధు చోప్రా

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త ఖ్యాతిని చాటుతున్న ప్రియాంక చోప్రాకు ఉత్త‌రప్ర‌దేశ్‌లోని బ‌రేలీ అంత‌ర్జాతీయ యూనివ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం చేయ‌నుంది. బ‌రేలీ ప్రియాంక స్వ‌స్థ‌లం. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత ఆమె ఈ ప్రాంతానికి రాబోతోంది. దీన్ని పుర‌స్క‌రించుకుని ఆమెకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇవ్వాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్ కేశవ్ కుమార్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రమంత్రి హర్షవర్థన్‌, యూపీ ఆర్థికమంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ హాజరుకానున్నారు.

తన కుమార్తెకు డాక్టరేట్‌ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్‌ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. ఇవాళ ఉద‌యం ఢిల్లీలో యునిసెఫ్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మం త‌ర్వాత బ‌రేలీ బ‌య‌ల్దేర‌నున్నారు.

More Telugu News