baba: హైద‌రాబాద్‌లో మ‌రో నకిలీ బాబా.. భ‌క్తుల‌కు తెలియ‌కుండా బంగారాన్ని కాజేసి ఇల్లు క‌ట్టుకున్న‌ వైనం!

  • నిందితుడి నుంచి 1.07 కిలోల ఆభ‌ర‌ణాలు, రూ.3.05 ల‌క్ష‌లు స్వాధీనం
  • టోలీచౌకిలోని ఇంట్లో ఆరేళ్లుగా పూజ‌లు నిర్వ‌హిస్తోన్న ఇస్మాయిల్
  • దీర్ఘ‌కాలిక రోగాల‌ను ఒకే ఒక్క పూజ‌తో న‌యం చేస్తాన‌ని మోసాలు
  • డబ్బు, బంగారానికి పూజ‌లు చేస్తే రోగాలు న‌య‌మ‌వుతాయ‌ని చెబుతోన్న మోస‌గాడు

హైద‌రాబాద్‌లో మ‌రో న‌కిలీ బాబా ఆట‌ల‌ను క‌ట్టించారు పోలీసులు. నిందితుడి నుంచి 1.07 కిలోల ఆభ‌ర‌ణాలు, రూ.3.05 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే న‌గ‌రంలోని టోలీచౌకిలోని ఓ ఇంట్లో ఆరేళ్లుగా ఇస్మాయిల్ బాబా పూజ‌లు నిర్వ‌హిస్తున్నాడు. దీర్ఘ‌కాలిక రోగాల‌ను ఒకే ఒక్క పూజ‌తో న‌యం చేస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి, న‌మ్మిస్తూ అమాయ‌కుల‌ను దోచేస్తున్నాడు.

డబ్బు, బంగారానికి పూజ‌లు చేస్తే రోగాలు న‌య‌మ‌వుతాయ‌ని చెబుతున్నాడు. భ‌క్తులు ఆ బాబా చెప్పిన‌ట్లే డ‌బ్బు, బంగారంతో వ‌చ్చి వాటికి పూజ‌లు చేయించుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ఇత‌రుల సాయంతో బాబా వాటిని కాజేస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు ఆ బాబా మోసంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. కాజేసిన బంగారాన్ని తాక‌ట్టుపెట్టి ఆ బాబా ఇల్లు నిర్మించుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.    

More Telugu News