lalu prasad yadav: కాసేప‌ట్లో తీర్పు... కుమారుడితో పాటు సీబీఐ కోర్టుకు చేరుకున్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్

  • దాణా కుంభకోణం కేసులో సుదీర్ఘంగా కొన‌సాగిన విచార‌ణ‌
  • లాలూ, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా పలువురిపై ఆరోప‌ణ‌లు
  • సీబీఐ కోర్టుకు చేరుకుంటోన్న ఇత‌ర నిందితులు

ఆర్జేడీ చీఫ్‌, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సహా కొంత‌మందిపై సుదీర్ఘంగా కొన‌సాగుతోన్న దాణా కుంభకోణం కేసులో కాసేప‌ట్లో తీర్పు వెలువ‌డ‌నుంది. 1991-94 మధ్యకాలంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రూ. 89 లక్షల రూపాయలను ట్రెజరీ నుంచి దాణా కోసం డ్రాచేసినట్లు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా పలువురిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లూలూ ప్ర‌సాద్ స‌హా ఇత‌రు‌ల‌పై తుది తీర్పును రాంచీ సీబీఐ కోర్టు వెల్ల‌డించ‌నుంది. ఈ నేప‌థ్యంలో త‌న కుమారుడు తేజ‌శ్వి యాద‌వ్‌తో పాటు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కోర్టుకు చేరుకున్నారు. మ‌రోవైపు ఇత‌ర నిందితులు కూడా కోర్టు వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

More Telugu News