virushka: విరుష్క ముంబై రిసెప్ష‌న్‌కి రంగం సిద్ధం.. జ‌ర‌గ‌బోయేది ఇక్క‌డే!

  • సెయింట్ రెజీస్ హోటల్లో రిసెప్ష‌న్‌
  • రాత్రి 8:30కి ప్రారంభం
  • హాజ‌రుకానున్న క్రికెట్‌, బాలీవుడ్ ప్ర‌ముఖులు

ఇటలీలో పెళ్లి, ఆల్ఫ్స్‌లో హానీమూన్‌, ఢిల్లీలో రిసెప్ష‌న్ పూర్త‌య్యాక త‌మ రెండో రిసెప్ష‌న్ కోసం విరుష్క జంట ఏర్పాట్లు చేస్తోంది. ముంబైలో డిసెంబ‌ర్ 26న జ‌ర‌గ‌నున్న ఈ రిసెప్ష‌న్ కేవ‌లం క్రికెట్‌, బాలీవుడ్ ప్ర‌ముఖుల కోస‌మే. ప్రతిష్ఠాత్మ‌క సెయింట్ రెజీస్ హోట‌ల్లోని ఆస్ట‌ర్ బాల్‌రూంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. రాత్రి 8:30 గం.ల‌కి ఈ రిసెప్ష‌న్ ప్రారంభం అవుతుంది. ఈ వేడుక‌కు కొంత‌మంది పారిశ్రామిక వేత్త‌లు కూడా హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది.

లోయ‌ర్ పారెల్ ప్రాంతంలో ఉన్న సెయింట్ రెజీస్ హోట‌ల్లోనే జహీర్ ఖాన్‌, సాగ‌రికల రిసెప్ష‌న్ కూడా జ‌రిగింది. వీరి రిసెప్షన్‌కి అనుష్క‌-విరాట్‌లు హాజరైన సంగ‌తి తెలిసిందే.

  

More Telugu News