vijay devarakonda: విజయ్ దేవరకొండ ఫస్టు తమిళ సినిమా ఖాయమైపోయింది!

  • యూత్ లో విజయ్ దేవరకొండకి క్రేజ్ 
  • చేతిలో అరడజనుకి పైగా తెలుగు సినిమాలు
  • తమిళంలోనూ ఒక సినిమాకి సైన్  

'అర్జున్ రెడ్డి' సినిమా హిట్ తో విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆయనకి అవకాశాలు వరుసబెడుతున్నాయి. తెలుగులో దాదాపు అరడజను సినిమాలు ఆయన చేతిలో వున్నాయి. ఈ నేపథ్యంలో తమిళం నుంచి కూడా ఆయనకి అవకాశాలు వస్తున్నాయి.

గతంలో విక్రమ్ తో 'ఇరుముగన్' చేసిన దర్శకుడు ఆనంద్ శంకర్, ఇటీవల విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో ఆ తమిళ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనే విషయంలో సందేహం ఉండేది. ఈ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. స్టూడియో గ్రీన్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తమిళ సినిమాతో .. అక్కడ కూడా మనవాడు తన హవాను మొదలుపెడతాడేమో చూడాలి. 

More Telugu News