laloo prasad yadab: 2జీ, ఆదర్శ్ స్కాంలు అయిపోయాయి.. ఈ రోజు లాలూ 'దాణా స్కాం' వంతు!

  • దాణా కుంభకోణంలో నేడు సీబీఐ కోర్టు తీర్పు
  • 1997లో కేసు నమోదు
  • నిన్ననే రాంచీ చేరుకున్న లాలూ

2జీ స్కాంలో కనిమొళి, ఎ.రాజాలకు ఊరట లభించగా... ఆదర్శ్ స్కాంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట అభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వంతు వచ్చింది. దాణా కుంభకోణంలో లాలూ, జగన్నాథ్ మిశ్రాలతో పాటు 22 మందిపై నేడు సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది.

ఈ నేపథ్యంలో, తన కుమారుడు తేజస్వితో కలిసి లాలూ నిన్ననే రాంచీకి చేరుకున్నారు. 1991-94 మధ్య కాలంలో డియోగఢ్ ట్రెజరీ నుంచి దాణా కోసం రూ. 89 లక్షలకు పైగా అక్రమంగా డ్రా చేసినట్టు లాలూతో పాటు 38 మందిపై 1997లో సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా, మిగిలిన వారు అప్రూవర్లుగా మారారు. అప్పుడు బీహార్ లో ఉన్న దియోగఢ్ ఇప్పుడు జార్ఖండ్ లో ఉంది.

More Telugu News