ఎర్ర చందనం కూలీలను కిడ్నాప్ చేసి, భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన హోంగార్డు

23-12-2017 Sat 06:32
  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • కూలీల బంధువులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్
  • సంచలనం రేపిన ఘటన

ఓం హోంగార్డు చేసిన నిర్వాకం పోలీస్ శాఖకు మచ్చ తెచ్చింది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఈ ఖాకీ ఏకంగా కిడ్నాప్ కు తెగించాడు. వివరాల్లోకి వెళ్తే, మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిత్తూరు జిల్లా ముత్యాలపల్లి పీఎస్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఇద్దరు ఎర్ర చందనం స్మగ్లర్లను కిడ్నాప్ చేసి, స్థానిక దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో బందీలను చేశాడు. వారిని చిత్ర హింసలు పెట్టాడు. కూలీల బంధువులకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సంచలనం రేగింది. హోంగార్డు వ్యవహారంపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.