మొద‌టి వికెట్ కోల్పోయిన శ్రీలంక!

22-12-2017 Fri 21:28
  • శ్రీలంక ముందు 261 ప‌రుగుల భారీ ల‌క్ష్యం 
  • ప్ర‌స్తుతం శ్రీలంక స్కోరు ఐదు ఓవ‌ర్ల‌కి 42
  • డిక్‌వెల్లా 25 ఔట్‌
  • జ‌య్‌దేవ్‌కి డిక్‌వెల్లా వికెట్‌

ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో జ‌రుగుతోన్న టీ20లో టీమిండియా ఇచ్చిన 261 ప‌రుగుల భారీ లక్ష్య ఛేద‌న‌లో శ్రీలంక‌కు తొలి దెబ్బ త‌గిలింది. నిరోష‌న్ డిక్ వెల్లా, ఉపుల్ త‌రంగ ఓపెన‌ర్లుగా క్రీజులోకి వ‌చ్చారు. క్రీజులో 19 బంతులు ఎదుర్కున్న డిక్‌వెల్లా 25 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌ టీమిండియా బౌల‌ర్‌ జ‌య్‌దేవ్ విసిరిన బంతిని షాట్‌గా మ‌ర‌ల్చ‌బోయి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చుకున్నాడు.

 అనంత‌రం క్రీజులోకి పెరీరా వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఉపుల్ త‌రంగ 14 (10 బంతుల్లో), పెరీరా 1 (1) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. శ్రీలంక స్కోరు ఐదు ఓవ‌ర్ల‌కి 42గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్‌లో పైకి ఎగ‌బాకుతుంది.