చంద్రబాబు కోసం ప్రపంచ తెలుగు మహాసభల తేదీలు మార్చడం కుదరదుగా?: నందిని సిధారెడ్డి

22-12-2017 Fri 20:00
  • చంద్రబాబును పిలవలేదనడం తప్పు 
  • ఆయన హాజరయ్యేందుకు తేదీలు కుదర్లేదు
  • ఆ సమాచారం తెలిశాకే తెలుగు మహాసభలు నిర్వహించాం

ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబును పిలవలేదనడం తప్పని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలనే నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. చంద్రబాబు హాజరయ్యేందుకు తేదీలు కుదర్లేదు. ఆ సమాచారం తెలుసుకున్న తర్వాతే మహాసభలు నిర్వహించాం. చంద్రబాబు కోసం ప్రపంచ తెలుగు మహాసభల తేదీలు మార్చడం కుదరదుగా? రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు పూర్తయితే తప్పా, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం పూర్తిగా రాదు’ అన్నారు.