ధాటిగా ఆడుతోన్న టీమిండియా ఓపెన‌ర్లు.. 23 బంతుల్లోనే రోహిత్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కం!

22-12-2017 Fri 19:50
  • 10 ఓవ‌ర్ల‌కి స్కోరు-117
  • క్రీజులో రోహిత శ‌ర్మ (74)
  • లోకేశ్ రాహుల్ (44)

ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో జ‌రుగుతోన్న శ్రీలంక‌, భార‌త్ రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 117 ప‌రుగులు న‌మోద‌య్యాయి. ఓపెనర్లు రోహిత్ శ‌ర్మ‌, లోకేశ్ రాహుల్ బ్యాట్లు ఝుళిపిస్తున్నారు. 23 బంతుల్లోనే రోహిత్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. టీ20 ల్లో రోహిత్ శ‌ర్మ‌కి ఇది 13వ అర్ధ సెంచ‌రీ. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్ శ‌ర్మ 74, లోకేశ్ రాహుల్ 44 ప‌రుగుల‌తో ఉన్నారు. 20 ఓవ‌ర్లు ముగిసే నాటికి టీమిండియా భారీ స్కోరు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది.