anasuya: ‘అజ్ఞాతవాసి’ పాటకు యాంకర్ అనసూయ డబ్ స్మాష్!

  • ‘బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీయో క్లాక్..’ పాటకు డబ్ స్మాష్
  • హావభావాలు పలికించిన అనసూయ
  • ఆకట్టుకుంటున్న వీడియో

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని ‘బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీయో క్లాక్..’ అనే పాటకు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ డబ్ స్మాష్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ పాటకు అనుగుణంగా అనసూయ తన హావభావాలను పలికిస్తూ ఆకట్టుకుంది. ఈ పాటలో ‘నీ చేతికున్న బ్యాంగిల్సే..’ అనే చరణానికి తన చేతి గాజులను ఊపుతూ, ‘కార్నర్ లో కాఫీ షాపు..’ అనే వాక్యానికి తన చేతిలో కాఫీ కప్పుతో హావ భావాలు పలికించింది.

More Telugu News