gionee: ఒకే వాట్సాప్.. మూడు ఖాతాలు.. జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎస్‌10 లైట్‌లో కొత్త ఫీచ‌ర్‌

  • గ్రూప్ సెల్ఫీ, బొకే సెల్ఫీ తీసుకునే అవ‌కాశం
  • శుక్ర‌వారం విడుద‌ల చేసిన జియోనీ
  • ధ‌ర రూ. 15,999

వాట్సాప్ ఒక‌టే... కానీ మూడు ఖాతాలు వాడుకునే అవ‌కాశాన్ని చైనీస్ మొబైల్‌ దిగ్గజం జియోనీ త‌మ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎస్‌10 లైట్‌లో క‌ల్పించింది. శుక్ర‌వారం భార‌త మార్కెట్‌లోకి విడుద‌లైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గ్రూప్ సెల్ఫీ, బొకే సెల్ఫీలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంది. బంగారు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.15,999. ఇందులో ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆప‌రేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల డిస్‌ప్లే, 16 ఎంపీ ఫ్లాష్‌ సెల్ఫీ ఫ్రంట్‌ కెమెరా, 13 ఎంపీ రియర్‌ ఆటో ఫోకస్‌ కెమెరా, 3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం) వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.

More Telugu News