వెరైటీ ఫోన్‌తో ఆక‌ట్టుకున్న కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్‌

22-12-2017 Fri 14:34
  • మొబైల్ ఫోన్‌కి ల్యాండ్‌లైన్ రిసీవ‌ర్‌తో అనుసంధానం
  • కార‌ణం చెప్ప‌ని మంత్రి
  • రేడియేష‌న్ నుంచి కాపాడుకునేందుకే?

ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మావేశాల‌కి హాజ‌రైన కేంద్ర‌మంత్రి జ‌వదేక‌ర్ ఇవాళ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. చేతిలో ఓ వెరైటీ ఫోన్ ప‌ట్టుకుని ఆయ‌న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో క‌లియ‌దిరిగారు. మొబైల్ ఫోన్‌, ల్యాండ్‌లైన్ రిసీవ‌ర్ క‌లిసి ఉన్న ఫోన్‌ను ఆయ‌న ప‌ట్టుకుని ఉన్నారు.

దాన్ని చూస్తే ల్యాండ్‌లైన్ రిసీవ‌ర్‌ను మొబైల్ ఫోన్‌కి అనుసంధానించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. అయితే అలా ఎందుకు అనుసంధానించారో మాత్రం తెలియ‌రాలేదు. బ‌హుశా.. మొబైల్ ఫోన్ రేడియేష‌న్ బారి నుంచి కాపాడుకునేందుకే ఆయ‌న ఇలా చేసి ఉంటార‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.