బాల్ థాక్రే జీవిత‌క‌థ‌తో సినిమా.... టీజ‌ర్ విడుద‌ల‌!

22-12-2017 Fri 11:53
  • బాల్ థాక్రేగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ
  • ఆస‌క్తి క‌లిగిస్తోన్న టీజ‌ర్‌
  • జ‌న‌వ‌రి 23, 2019న విడుద‌ల‌
శివ‌సేన నాయ‌కుడు బాల్ థాక్రే జీవితం ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న 'థాక్రే' చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో బాల్ థాక్రే పాత్ర‌ను విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పోషిస్తున్నారు. బాల్ థాక్రే బలమైన శివ‌సేన నాయ‌కుడుగా ఎలా మారాడ‌నే అంశాల‌ను ఇందులో చూపించ‌నున్నారు. దాదాపు రెండు నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న ఈ టీజ‌ర్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీని చూస్తే థాక్రే పాత్ర‌లో ఒదిగిపోయిన‌ట్లుగా అనిపిస్తోంది.

థాక్రే పాత్ర‌లో న‌టిస్తుండ‌టం గ‌ర్వంగా భావిస్తున్న‌ట్లు న‌వాజుద్దీన్ ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉద్ధ‌వ్ థాక్రేకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ చిత్రానికి పాత్రికేయుడు, ఎంపీ సంజ‌య్ రౌత్ క‌థ‌ను అందించారు. అభిజిత్ పాన్సే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిందీ, మ‌రాఠీ భాష‌ల‌తో పాటు ఇంగ్లిషులోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. 2019, జ‌న‌వ‌రి 23న ఈ చిత్రం విడుద‌లకానుంది.