yogi adityanath: యూపీ సీఎం ఇంటి ముందు సెల్ఫీ దిగితే...ఇక జైలుకేనట!

  • యూపీ సీఎంకు పెరుగుతున్న ఉగ్రముప్పు
  • కీలక నిర్ణయాలు ప్రకటించిన సెక్యూరిటీ అధికారులు
  • హై సెక్యూరిటీ జోన్ లో ఆయన నివాసం
  • సెల్ఫీలపై నిషేధం

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఉగ్రవాదుల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయన భద్రతా విభాగం కీలక నిర్ణయాలు తీసుకుంది. లక్నోలోని ఆయన నివాస ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్ కింద చేర్చి, అక్కడ సెల్ఫీలు దిగడాన్ని నిషేధించారు. ఆ ఇంటి ముందు సెల్ఫీలు దిగితే జైల్లో పెడతామని హెచ్చరిస్తూ, ఓ పోస్టరును పోలీసులు పెట్టగా, ఆ పోస్టర్ ఫోటోను మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాద్వారా చూపారు.

లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇంటి ముందు నుంచి వెళ్లేవాళ్లు సెల్ఫీలు దిగరాదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, చిక్కుల్లో పడ్డట్టేనని హెచ్చరిస్తూ పోలీసులు ఓ బ్యానర్ కట్టారు. అది వీఐపీ ఏరియా అని గుర్తు చేశారు. ఇదిలావుండగా, అఖిలేశ్ చేసిన ట్వీట్ వైరల్ కావడంతో, అధికారులు ఆ బ్యానర్ ను తొలగించడం గమనార్హం.

More Telugu News