2G spectrum: 2జీ స్కామ్ నుంచి బయటపడేందుకు రాజా చేసిన పెద్ద రిస్క్ ఇది!

  • 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ నుంచి నిర్దోషిగా బయటపడిన రాజా
  • తమ వాదనకు తామే సాక్షులుగా కోర్టు ముందుకు వచ్చిన రాజా
  • తమను తాము సమర్థించుకున్న వైనం 

2008లో వివిధ కంపెనీలకు కేటాయించిన రెండవ తరం వాయు తరంగాల కుంభకోణంలో అప్పటి టెలికం మంత్రి ఎ రాజా, కరుణానిధి కుమార్తె కనిమోళి సహా, మొత్తం 15 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. ఇక ఈ కేసు నుంచి బయటపడేందుకు రాజా ఎంతో రిస్క్ చేశారని, ఆయన ధైర్యం చేయడమే, ఇప్పుడాయన్ను కాపాడిందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజాతో పాటు ఆయన మాజీ ప్రైవేటు కార్యదర్శి ఆర్ కే చందోలియాలు, తమ వాదనకు తామే సాక్షులుగా కోర్టు ముందుకు వచ్చి పెద్ద రిస్క్ చేశారని, రాజ్యాంగ పరంగా తమకు లభించిన హక్కుతో తమను తాము వారు సమర్థించుకున్నారని అంటున్నారు.

అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని, ఒక్క మాట జారినా వారు ఇబ్బందుల్లో పడి వుండేవారని ఇదే కేసులో నిందితులుగా ఉన్న కొందరి తరపున వాదనలు వినిపించిన లాయర్ విజయ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఐపీసీలోని సెక్షన్ 315 ప్రకారం, ఒక నిందితుడు సాక్షిగా ముందుకొచ్చే అవకాశం ఉందని, అయితే, అలా జరగడం చాలా అరుదని, దాన్ని వాడుకునే రాజా తదితరులు లబ్దిని పొందారని వ్యాఖ్యానించారు.

More Telugu News