Password: మీకు తెలుసా? ఈ ఏడాది అతి చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే!

  • విడుదల చేసిన ఆన్‌లైన్ సర్వే సంస్థ
  • 12345కే చాలామంది మొగ్గు
  • హ్యాకర్ల బారిన పడడం ఖాయమంటూ హెచ్చరికలు

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించిన చెత్త పాస్‌వర్డ్‌లు ఇవేనంటూ ఓ ఆన్‌లైన్ పరిశోధన సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. ఇటువంటి పాస్‌వర్డ్‌ల వల్ల చాలా సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సోషల్ మీడియాలోని వ్యక్తిగత సమాచారం, మెయిల్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతా పాస్‌వర్డ్‌లు చాలా సులభంగా హ్యక్‌ చేసే వీలుందని పేర్కొంది. పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకునేందుకు చాలా చాలా సులభంగా ఉన్న వాటినే యూజర్లు ఎంపిక చేసుకుంటున్నట్టు తమ సర్వేలో తేలిందని ఆన్‌లైన్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు కొన్ని పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది.  

వాటిలో తొలి ఐదు ఇలా ఉన్నాయి..
ఎక్కువమంది ఎంచుకున్న పాస్‌వర్డ్ 12345. చాలామంది అంకెలనే పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తమ సర్వేలో తేలినట్టు పేర్కొంది. అలాగే ‘పాస్‌వర్డ్’ను కూడా ఎక్కువమంది ఉపయోగిస్తుండగా, తర్వాతి స్థానంలో ‘12345678’, కీబోర్డు‌లోని ‘క్వెర్టీ’లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నారు.

More Telugu News