jai simha: సింహం మౌనాన్ని స‌న్యాసం అనుకోవ‌ద్దంటోన్న బాల‌కృష్ణ‌.. 'జై సింహా' టీజ‌ర్‌ విడుద‌ల‌!

  • బాల‌య్య  ఫైట్స్‌, డైలాగ్స్ అదుర్స్
  • కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో జై సింహా
  • ఈ నెల‌ 24వ తేదీన 'జై సింహా' ఆడియో లాంచ్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ న‌టిస్తోన్న జై సింహా టీజ‌ర్‌ను ఆ సినిమా బృందం ఈ రోజు విడుద‌ల చేసింది. బాల‌య్య చేస్తోన్న ఫైట్స్‌ అదుర్స్ అనిపిస్తున్నాయి. బాలయ్య మాస్‌లుక్‌తో పాటు స్టైలిష్ లుక్‌తోనూ క‌న‌ప‌డుతున్నారు. 'సింహం మౌనాన్ని స‌న్యాసం అనుకోవ‌ద్దు.. సైలెంటుగా ఉంద‌ని కెలికితే త‌ల కొరికేస్త‌దీ..' అంటూ బాల‌య్య డైలాగు కొట్టారు.

ఈ సినిమాలో నయనతార, నటాషా దోషీ, హరిప్రియ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల‌ 24వ తేదీన 'జై సింహా' ఆడియో లాంచ్ వేడుకను విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించ‌నున్నారు. కాగా, జై సింహా వ‌చ్చేనెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

More Telugu News