ar rahman: ఏ.ఆర్. రెహ‌మాన్ '99 సాంగ్స్' సినిమాలో చేసేది వీరే!

  • మ‌నీషా కొయిరాల‌, లీసా రే మిన‌హా అంద‌రూ కొత్త‌వాళ్లే
  • ఈ చిత్రానికి క‌థ‌ను అందించిన రెహ‌మాన్‌
  • స‌హ-నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆస్కార్ గ్ర‌హీత‌

గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ నిర్మిస్తున్న '99 సాంగ్స్‌'లో న‌టిస్తున్న న‌టీన‌టుల వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. యూట్యూబ్ వీడియో ద్వారా న‌టీన‌టుల‌ను ఆయ‌న ప‌రిచ‌యం చేశారు. మ‌నీషా కొయిరాల‌, లీసా రే మిన‌హా దాదాపు మిగ‌తా న‌టులంద‌రూ కొత్త‌వాళ్లే. ఈ చిత్రంలో ఈహాన్ భ‌ట్‌, ఎడిల్సీ వ‌ర్గీస్‌లు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. దాదాపు వెయ్యి మందికి ఆడిష‌న్ నిర్వ‌హించి వీరిద్ద‌రినీ ఎంపిక చేసిన‌ట్లు గ‌తంలో ఏఆర్ రెహ‌మాన్ ట్వీట్ కూడా చేశారు.

ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ స్క్రిప్టును అందించారు. అలాగే స‌హ‌-నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. విశ్వేశ్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 10 నుంచి 12 పాట‌లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Telugu News