sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 21 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 4 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • జాతీయంగా, అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడమే కారణం

ఈ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు చాలా డల్ గా, నిదానంగా సాగాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు లేకపోవడమే దీనికి కారణం. ఇవాల్టి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 21 పాయింట్లు కోల్పోయి 33,756 వద్ద ముగిసింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 10,440కు పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్:
ఐఎఫ్సీఐ లిమిటెడ్ (20.29%), మణప్పురం ఫైనాన్స్ (12.55%), యూనిటెక్ లిమిటెడ్ (11.86%), వోక్ హార్డ్ లిమిటెడ్ (11.78%), అదానీ ట్రాన్స్ మిషన్ (9.96%).

టాప్ లూజర్స్...
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (-3.74%), డెన్ నెట్ వర్క్స్ (-3.50%), క్యాస్ట్రాల్ ఇండియా (-3.25%), బాల్ క్రిష్ణ ఇండస్ట్రీస్ (-3.22%), మదర్సన్ సుమీ సిస్టమ్స్ (-3.13%).    

More Telugu News