amazon: సొంతంగా వీడియో స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ను ప్రారంభించ‌నున్న అమెజాన్‌

  • ఇప్ప‌టికే డొమైన్లు రిజిస్ట‌ర్ చేయించిన అమెజాన్
  • ప‌రిశీల‌న‌లో అమెజాన్ ట్యూబ్‌, ఓపెన్ ట్యూబ్‌, అలెక్సా ట్యూబ్ పేర్లు
  • గూగుల్ మీద ప్ర‌తీకారం తీర్చుకునేందుకే?

గూగుల్‌, అమెజాన్ కంపెనీల మ‌ధ్య వైరం ఎప్ప‌ట్నుంచో కొన‌సాగుతూనే ఉంది. అందులో భాగంగా అమెజాన్ అందించే ఫైర్ టీవీ, ఎకో డివైస్‌ల నుంచి యూట్యూబ్ అప్లికేష‌న్ సేవ‌ల‌ను విర‌మించుకుంటామ‌ని గూగుల్ ఇటీవ‌ల బెదిరించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బెదిరింపుల‌కు ప్ర‌తిగా తామే సొంత వీడియో స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ను ప్రారంభించాల‌ని అమెజాన్ నిశ్చ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు అమెరికా పేటెంట్‌, ట్రేడ్ మార్క్ వ‌ద్ద కొన్ని డొమైన్ల‌ను కూడా అమెజాన్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు తెలుస్తోంది. వీటికి అమెజాన్ ట్యూబ్‌, ఓపెన్ ట్యూబ్‌, అలెక్సా ట్యూబ్ వంటి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ వీడియో స్ట్రీమింగ్ స‌ర్వీస్‌లో కేవ‌లం వీడియోలు మాత్ర‌మే కాకుండా ఫొటోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, డేటా, ఇతర సమాచారం కూడా షేర్ చేసుకునే వీలు కల్పించేందుకు అమెజాన్ యోచిస్తోంది. ఈ విష‌య‌మై అమెజాన్ అధికారిక ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

More Telugu News