2g scam: కనిమొళి, రాజాలు నిర్దోషులు.. 2జీ కేసులో పటియాలా కోర్టు సంచలన తీర్పు.. సంబరాల్లో డీఎంకే!

  • దోషులుగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవు
  • ప్రాసిక్యూషన్ విఫలమైంది
  • తుది తీర్పును వెలువరించిన పటియాల హౌస్ కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రూ. 1.76 లక్షల కోట్ల 2జీ స్కాం కేసులో పటియాలా హౌస్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కీలక నిందితులైన డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళి, కేంద్ర మాజీ టెలికాం మంత్రి ఎ.రాజాలను నిర్దోషులుగా ప్రకటించింది. వీరిద్దరితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 15 మందిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులను దోషులుగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవని, నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది.

2011 నుంచి ఈ కేసు విచారణ కొనసాగింది. మన దేశంలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాల్లో ఇది కూడా ఒకటి.  ఈ స్కాం వల్ల దేశ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ కాగ్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఈ స్కాంకు సంబంధించి సీబీఐ, ఈడీలు వేర్వేరుగా కేసులు పెట్టాయి.

కాగా, పటియాలా హౌస్ కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. చెన్నైలోని కనిమొళి ఇంటి వద్ద, డీఎంకే కార్యాలయం వద్ద సందడి నెలకొంది.  

More Telugu News