కొత్త 'బడ్జెట్ స్మార్ట్‌ఫోన్'ను విడుదల చేసిన అమెజాన్ ఇండియా!

- టెనార్ డీ పేరుతో ప్రత్యేక అమ్మకాలు
- జనవరి 5, 2018న సేల్
- ఆకట్టుకుంటున్న ఫీచర్లు
జనవరి 5, 2018 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది. ఈ టెనార్ డీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కూడా ఇంచు మించు రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ని పోలి ఉన్నాయి. 5.2 ఇంచుల డిస్‌ప్లే, 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలు, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక సంవత్సరం పాటు అదనపు వారంటీ కూడా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది.