zanco: ప్ర‌పంచంలో అతి చిన్న మొబైల్ ఫోన్‌... జాంకో టైనీ టీవ‌న్‌

  • త‌యారుచేసిన లండ‌న్ కంపెనీ
  • క్రెడిట్ కార్డ్ కంటే చాలా చిన్నగా ఉన్న ఫోన్‌
  • ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల‌

కాలంతో పాటు మొబైల్ ఫోన్ ప‌రిమాణం కూడా మారిపోయింది. కొన్ని చిన్న‌గా, మ‌రికొన్ని పెద్ద‌గా ఇలా అన్నిర‌కాల సైజుల్లోనూ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే బాట‌లో లండ‌న్‌కి చెందిన క్లూబిట్ న్యూ మీడియా కంపెనీ ప్ర‌పంచంలో అతిచిన్న మొబైల్‌ఫోన్‌ను త‌యారుచేసింది. దీనికి 'జాంకో టైనీ టీవ‌న్‌' అని పేరు పెట్టారు. క్రెడిట్ కార్డు కంటే చాలా చిన్న‌గా ఉన్న ఈ ఫోన్‌ను ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల చేశారు.

2జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఈ ఫోన్ అథ్లెట్ల‌కు, జాగ‌ర్ల‌కు ఉప‌యోగక‌రంగా ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. 13 గ్రా.ల బ‌రువు, 200 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం, నానో సిమ్‌కార్డ్‌, 300 ఫోన్‌బుక్ మెమొరీ, 50 మెసేజ్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని 40 డాల‌ర్ల‌కు అంటే దాదాపు రూ. 2,563ల‌కు విక్ర‌యించేందుకు కంపెనీ నిర్ణ‌యించింది. ఇదిలా ఉండ‌గా, ఢిల్లీకి చెందిన ఈ-కామ‌ర్స్ సంస్థ యెర్హా డామ్ కామ్ వారు గ‌త నెల 'నానోఫోన్ సీ' పేరుతో అతిచిన్న మొబైల్ ఫోన్ ను దేశీయంగా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని ప్ర‌పంచంలోనే అతిచిన్న జీఎస్ఎమ్ మొబైల్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధ‌ర రూ. 2999.

More Telugu News