facebook: ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచ‌ర్‌... ఫొటోల అభ్యంత‌ర‌ వాడ‌కంపై కట్టుదిట్టం

  • ఫొటోలు వాడిన వివరాల‌తో నోటిఫికేష‌న్‌
  • ఫేషియ‌ల్ రికగ్నిష‌న్ ద్వారా ప‌నిచేసే ఫీచర్‌
  • అస‌భ్యంగా వాడిన‌ట్లు తెలిస్తే అకౌంట్ బ్లాక్‌

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్‌లో కొంత‌మంది ఫొటోలు పెట్ట‌డానికి సంకోచిస్తుంటారు. ఎక్క‌డ త‌మ ఫొటోల‌ను త‌ప్పుడు ప‌నులకు వాడ‌తారోనన్నదే వారి భ‌యం. ఇక నుంచి అలా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఫొటోల అభ్యంత‌ర వాడకాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని సాయంతో ఒక వినియోగ‌దారుడి ఫొటోల‌ను మ‌రొక వినియోగ‌దారుడు వాడిన‌పుడు, వెంట‌నే ఆ ఫొటోలో ఉన్న వారంద‌రికీ నోటిఫికేష‌న్ వెళ్తుంది.

ఆ ఫొటోను రివ్యూ చేయాల‌ని ఆ నోటిఫికేష‌న్ సూచిస్తుంది. అందులో ఏదైనా అభ్యంత‌ర‌క‌రంగా అనిపిస్తే ఫొటోను రిపోర్ట్ చేసే సదుపాయాన్ని కూడా ఫేస్‌బుక్ క‌ల్పిస్తోంది. ఒక‌వేళ ఫొటో రివ్యూలో ఏమైనా త‌ప్పుడుగా వాడిన‌ట్లు తెలిస్తే ఫొటో షేర్ అప్‌లోడ్ చేసిన వారి అకౌంట్‌ను బ్లాక్ చేసే అవ‌కాశం కూడా ఉంది. ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫీచ‌ర్ ప‌నిచేయ‌నుంది. ఈ క్ర‌మంలో ఆ ఇద్ద‌రు యూజ‌ర్లు ఫ్రెండ్స్ అయినా, కాకున్నా ఈ ఫీచ‌ర్ పనిచేస్తుంది. అలాగే ఇత‌రుల ఫొటోల‌ను ప్రొఫైల్ పిక్‌లుగా కూడా పెట్టుకోలేరు. దీని వల్ల నకిలీల బెడద తగ్గుతుందని ఫేస్‌బుక్ పేర్కొంది.

More Telugu News