kodali nani: వైసీపీకి షాక్... టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్!

  • వైసీపీకి మరో షాక్
  • టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్
  • వైసీపీ కింది స్థాయి నేతలను టార్గెట్ చేసిన టీడీపీ

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్న రవికాంత్ టీడీపీలో చేరారు.

త్వరలో ఇంకా కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఓ వైపు జరుగుతుండగా... కింది స్థాయి నాయకులను కూడా ఆకర్షించే పనిలో టీడీపీ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే రవికాంత్ ను టీడీపీలోకి ఆకర్షించగలిగింది.

More Telugu News