tulasi reddy: గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మోదీ శ‌కం ముగిసింది.. రాహుల్ శ‌కం ప్రారంభ‌మైంది: తుల‌సిరెడ్డి

  • ఎన్నిక‌ల ఫ‌లితాలను సూక్ష్మంగా ప‌రిశీలిస్తే ఈ విష‌యం తెలుస్తోంది
  • గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య‌ను 60 నుంచి 79కి పెంచుకోవ‌డం గ‌మ‌నార్హం
  • బీజేపీ భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టింది.. ఆర్థిక బ‌లం ప్ర‌ద‌ర్శించింది
  • అత్తెస‌రు మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది

ఇటీవ‌ల జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలను సూక్ష్మంగా ప‌రిశీలిస్తే దేశంలో మోదీ శ‌కం ముగిసిన‌ట్లు, రాహుల్ శ‌కం ప్రారంభ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత తుల‌సిరెడ్డి చెప్పారు. గుజ‌రాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోయిన‌ప్ప‌టికీ సీట్ల సంఖ్య‌ను 60 నుంచి 79కి పెంచుకోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అన్నారు.

ఈ రోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో మాట్లాడుతూ... భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం, ఆర్థిక బ‌లం, అంగ‌బ‌లం వంటివి ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేద‌ని చెప్పారు. చావు త‌ప్పి క‌న్నులొట్టబోయిన చందంగా అత్తెస‌రు మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని అన్నారు.

More Telugu News