Gujarath: గుజ‌రాత్ ఎన్నిక‌ల గురించి 1.9 మిలియ‌న్ల ట్వీట్లు.. విప‌రీతంగా ట్రెండ్ అయిన మోదీ!

  • త‌ర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ
  • జీఎస్‌టీ, నోట్ల‌ర‌ద్దు ఎక్కువ ట్రెండ్ అయిన అంశాలు
  • వెల్ల‌డించిన ట్విట్ట‌ర్ ఇండియా

గుజ‌రాత్ ఎన్నిక‌ల గురించి దాదాపు 1.9 మిలియ‌న్ల ట్వీట్లలో ప్ర‌స్తావ‌న‌ వ‌చ్చిన‌ట్లు సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 1 నుంచి 18 మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అయిన అంశాల అధ్య‌య‌నంలో ఈ విష‌యం తెలిసింది. అలాగే కాంగ్రెస్ వారు ప్రచారాయుధాలుగా ఎంచుకున్న జీఎస్టీ, నోట్ల‌ర‌ద్దు, హిందుత్వం వంటి అంశాలు కూడా ట్రెండ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇక వ్య‌క్తుల విష‌యానికి వ‌స్తే.... గుజరాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ట్రెండ్ అయిన వారిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొద‌టి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రాహుల్ గాంధీ ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ఇండియా ప్ర‌క‌టించింది. మూడో స్థానంలో పాటిదార్ నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్‌, నాలుగో స్థానంలో బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఉన్న‌ట్లు తెలిపింది. వీరితో పాటు ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ, ద‌ళితుల నాయ‌కుడు జిగ్నేశ్ మేవానీ, ఓబీసీ నాయ‌కుడు అల్పేశ్ ఠాకూర్‌ల గురించి కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించింది.

అలాగే గుజ‌రాత్ అభివృద్ధి  అనే అంశం గురించి ట్విట్ట‌ర్‌లో ఎక్కువ చ‌ర్చ జ‌రిగిన‌ట్లు పేర్కొంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల కోసం ట్విట్ట‌ర్ మొద‌టిసారిగా లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ప్ర‌చారంలో భాగంగా చాలా మంది నాయ‌కులు ట్విట్ట‌ర్‌ను వార‌ధిగా చేసుకున్నార‌ని, దాదాపు వారు చేసిన ట్వీట్ల‌న్నీ హిందీ భాషలోనే ఉన్నాయ‌ని ట్విట్ట‌ర్ ఇండియా తెలిపింది.

More Telugu News