Anushka Shetty: పాడుబడిన బంగ్లాలోకి అడుగుపెట్టిన 'భాగమతి' .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టీజర్

  • 'భాగమతి' గా కనిపించనున్న అనుష్క 
  • దర్శకుడిగా అశోక్ తెరకెక్కించిన భారీ చిత్రం 
  • కథాకథనాల పట్ల కుతూహలాన్ని కలిగిస్తోన్న టీజర్

అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' సినిమా రూపొందింది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అనుష్క పాత్ర ఎలా ఉండనుంది? ఆమె చుట్టూ తిరిగే కథా నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను వదిలారు.

 ఉరుములు .. మెరుపుల మధ్య చీకటిలో.. శిథిలావస్థలో వున్న బంగ్లాలోకి కథానాయిక అడుగుపెడుతుంది. ఒకప్పటి జమీందార్ బంగ్లా మాదిరిగా కనిపిస్తోన్న ఆ పాడుబడిన బంగాల్లోకి కథానాయిక ప్రవేశిస్తుంది. అక్కడ ఆమె దేని కోసమో వెతుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ తరువాత తన చేతిని తానే ఓ గోడకి ఆనించి . . అరచేతిలో 'మేకు' దిగ్గొట్టుకుంటుంది. ఫస్టు లుక్ పోస్టర్ లో ఏదైతే చూపించారో .. ఫస్టు టీజర్ లోను అదే దృశ్యాన్ని చూపించారు. ఇక కథానాయిక ఆ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటనే ఆసక్తిని రేకెత్తించడంలో ఈ సినిమా టీమ్ సఫలీకృతమైందనే చెప్పాలి.

More Telugu News