sunny leone: సన్నీ లియోన్ ఈవెంట్‌కు అనుమతించకపోవడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్

  • ఈవెంట్‌కు ముందు అనుమ‌తించార‌న్న నిర్వాహ‌కులు
  • ప‌ది మంది వ‌చ్చి గొడ‌వ చేయ‌గానే అనుమ‌తి ర‌ద్దు చేశారంటూ పిటిష‌న్
  • పోలీసుల ఆదేశంతో హాజ‌రుకాలేన‌ని ట్వీట్ చేసిన స‌న్నీ

న్యూఇయ‌ర్ పార్టీలో స‌న్నీ లియోన్ డ్యాన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ర‌ద్దు చేయ‌డంపై బెంగళూరుకి చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క‌ర్ణాట‌క హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 'సన్నీ నైట్‌' పేరుతో నిర్వ‌హించ‌నున్న ఈవెంట్‌కి పోలీసులు ముందు అనుమ‌తినిచ్చార‌ని, త‌ర్వాత ఓ ప‌ది మంది వ‌చ్చి గొడ‌వ చేయ‌గానే ఈవెంట్ అనుమ‌తిని ర‌ద్దు చేశార‌ని టైమ్ క్రియేష‌న్స్ సంస్థ త‌మ పిటిష‌న్‌లో పేర్కొంది.

క‌న్న‌డ సంస్కృతిని కించ‌ప‌రిచేలా నృత్యాలు చేస్తోంద‌ని, స‌న్నీ లియోన్ గ‌తం కార‌ణంగా ఆమె వేడుక‌కు హాజ‌రైతే ఆత్మ‌హ‌త్య‌కు కూడా సిద్ధ‌మేన‌ని క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక యువ‌సేన స‌భ్యులు రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు పోలీసులు ఈవెంట్ అనుమ‌తిని ర‌ద్దు చేశారు. వారి ఆదేశాల నిమిత్తం ఈవెంట్‌కి హాజ‌రుకాలేకపోతున్న‌ట్లు స‌న్నీ లియోన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News