Venkaiah Naidu: ‘ఈ-సిగరెట్’ అంటే ఏమిటి?.. ఆరోగ్యశాఖా మంత్రిని అడిగిన వెంకయ్య.. సభలో నవ్వులు!

  • వెంకయ్య ప్రశ్నకు నవ్వేసిన సభ్యులు 
  • ఈ-సిగరెట్ గురించి వివరించిన కేంద్ర మంత్రి
  • సిగరెట్ తాగడం కంటే ఎక్కువ కిక్ ఇస్తుందని వివరణ

రాజ్యసభలో మంగళవారం కొన్ని సరదా సంభాషణలు జరిగాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, ఆరోగ్యశాఖా మంత్రిని అడిగిన ప్రశ్నతో సభలో నవ్వులు విరిశాయి. ఈ-సిగరెట్లు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రశ్నోత్తరాల సమయంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని.. ‘‘దేశం కోసం, సభ్యుల కోసం ఆరోగ్యశాఖా మంత్రిని ఓ విషయం అడగాలనుకుంటున్నా. ఇంతకీ ఈ-సిగరెట్ అంటే ఏమిటి?’’ అని ఆసక్తిగా ఆడగడంతో ఎంపీలు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా నవ్వేశారు.

వెంకయ్య ప్రశ్నకు సమాధానంగా ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ-సిగరెట్ అనేది  నికోటిన్ పొగను ఇచ్చే ఓ పరికరమని, అందులో నికోటిన్ క్యాప్యూల్ వేస్తారని, పరికరం వేడెక్కడం ద్వారా పొగ బయటకు వస్తుందని, దానిని పీలుస్తారని  మంత్రి వివరించారు. అందులో పొగాకుకు బదులుగా నికోటిన్ వాడతారని పేర్కొన్నారు. సిగరెట్ తాగడం కంటే ఇది ఎక్కువ కిక్ ఇస్తుందని మంత్రి సభకు తెలిపారు.

More Telugu News