Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • యథార్థ కథతో అంజలి సినిమా 
  • రిపబ్లిక్ డేకి అనుష్క 'భాగమతి'
  • ఫిబ్రవరి నుంచి మణిరత్నం షూటింగ్ 
  • తెలుగు సినిమాలో అమలాపాల్

*  అంజలి ప్రధాన పాత్ర పోషించే చిత్రం షూటింగ్ వచ్చే నెలలో మొదలవుతుంది. కర్రి బాలాజీ దర్శకత్వం వహించే ఈ చిత్రం కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి కీలక పాత్ర పోషిస్తుంది.
*  అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'భాగమతి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేస్తారు. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
*  'చెలియా' సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించే చిత్రం షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. రెగ్యులర్ షూటింగును మాత్రం ఫిబ్రవరి నుంచి నిర్వహిస్తారు. ఇందులో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
*  అమలాపాల్, స్నేహ ఉల్లాల్ కలసి ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. 'ఆయుష్మాన్ భవ' పేరిట రూపొందుతున్న ఈ చిత్రంలో అమలాపాల్ ముస్లిం యువతిగా నటిస్తోంది.  

More Telugu News